నా మదిలో మెరిసే అలికిడి
నా హృదయపు మువ్వల సవ్వడి
చేరాలి నీ ఒరవడి
నీ తోలిచూపుకే ఇంత అలజడి
మన చూపులు కలిసిన క్షణం
మొదలాయే మదిలో పరవశం
మనస్సులో లేదు కల్మషం
ఎగిరెను ప్రేమ పావురం
లోలోపల చిక్కు ప్రశ్నలు
లేనేలేదు సమాధానాలు
కురిసే చిరుజల్లు
వెలసే వానవిల్లు
నీ చూపులో ఏముంది సఖి
నిను చూడగానే పులకించే నామది
నీ సిగ్గు చేసింది నాను జీవ సమాధి
మన ప్రేమకు ఇదేనేమో పునాది
నిను చూసిన తొలిక్షణం
నేను చేరాను నీ పక్షణం
నీ ప్రేమ పొందడమే నా లక్ష్యం
నేను చెయ్యలేను దీనిలో జాప్యం
నీ వోరకంటి చూపు
నన్ను ఊపింది పెద్ద ఊపు
నిన్ను వదిలి పోవట్లేదు నా చూపు
నా ఫై కాస్త ప్రేమను నువ్వు చూపు
నేను కదిలే క్షనమోచ్చే
నా మనసు నీదాయే
శవం లా నా పాదాలు కదిలే
మనసంతా నీపై ప్రేమ అలలే
ప్రతిక్షణం నీ తలపే
నాకు కావలి మన తొలివలపే
వినాలి నా దేవత పిలుపే
నా పేరే నాకు మరచే