ఎక్కడ కలవాలన్నది వివదిచం ఏడుగంటలు
ఎక్కేసి వచేసుంటాం ఏడు కొండలు
ఎక్కాడన్నది నిస్చయించం
ఎలా అన్నది ఆలోచించాం
వచ్చింది నా చెలి పిలుపు
కలుసుకోవడం లో పెద్ద మలుపు
రేపే కలుద్ధామన్నది
నాకు వీలవుతుందా అని కోరింది
వెంటనే తెలిపాను సమ్మతం
నా కోరిక అవ్వబోతుంది నిజం
సెలవు కావాలని అభ్యర్ధన పెట్టాను
కలవబోతున్న అందంతో గంతులేసాను
సత్యం సినిమాస్ వాకిలి
ఈరోజు కలుస్తుంది నా చెలి
వీస్తుంది వేడి గాలి
కావాలి నాకు తన కౌగిలి
ఇరువురిలోను తుళ్ళింత
మదినిండా గిలిగింత
చూపిస్తాను తనకు నా ప్రేమంతా
ఈరోజు నుంచి తనవాదినవుతా
క్షణాలు యుగాలాయే
కళ్ళు తన రాకకై ఎదురు చూసే
ఇంకొద్ది సేపట్లో వచేస్తానని తను కబురు పంపే
మదినిండా తపన అల్లుకు పోయే
శిలనయ్యా ఒక క్షణం
నా ప్రేమను చూసిన తరుణం
నవ నాడులు స్తంబించే
నన్ను నేనే మరిచిపోయే
వచ్చింది చిరునవ్వు
మొదలాయే వికసింపు
ఇదేనేమో తొలివలపు
విన్నది నాకు తీయటి పిలుపు
లోనికి వెళ్ళాం
కబుర్లు చెప్పుకున్నాం
ప్రేమను పంచుకున్నం
మనసార నవ్వుకున్నాం
నా చెలి మనసార నవ్వినా సంతోషం
తన దుఖ్ఖాన్ని తగ్గించిన ఆనందం
వచ్చింది నాకు సందేహం
ఇదేనా నా ప్రేమను చెప్పే సందర్భం???
తెర మీద ఏం మాయ చేసావే
నీవు ఏం మాయ చేసావే
నీ కోసమై తపించేలా చేసావు
నే కొరకై బ్రతకేలా చేసావు
చూడలేదు తీరని
చూస్తూనే ఉన్నాను నా చెలిని
క్షణం ఆగకుండా చూడాలని ఉంది
రెప్పార్పడం కూడా నాకు మరచింది
తీసుకోచాను చిరుతిండి
నా చేతితో తినిపించమంది
ఈనాటికి నాకీ అద్రుష్టం కలిగింది
దేవుడికి మనసు ధన్యవాదాలు తెలిపింది
తన తో ఉన్నదీ మూడు గంటలే
గడిచినట్టు తెలిసింది మూడు క్షణాలే
తనతో ఆ ఫై ఉండలేని పరిస్థితి
వెళ్ళాలి నా స్నేహితులతో ఊటీ
కదిలాను నా స్థావరానికి
వేల్లోస్తానని నా చెలికి
కన్నీటి వీడ్కోలు పలికింది
మనసారా చిరునవ్వు చిందించింది
తన జ్ఞ్యాపకమే ప్రతిక్షణం
వెళ్లాలని అనిపించలేదు తక్షణం
వెళ్ళాక తప్పలేదు మరుక్షణం
తనతోనే ఇక గడపాలన్నది నా లక్ష్యం
ఒక పక్క ఎనలేని సంతోషం
మరో పక్క కానరాని దుఖ్ఖం
ఏమో తెలియని మర్మం
ఇదేనా ప్రేమ మహత్యం
వెళ్ళాను ఊటీకి స్నేహితులతో
తీసుకేల్లను మధురానుబూతులు నాతో
తనతో ఉన్న క్షణాలే అనుక్షణం నాలో
తనపి ప్రేమ పెరుగుతూనే ఉంది లోలో ……………. కొనసాగుతుంది