Visit blogadda.com to discover Indian blogs Sukumar's Page: June 2011

Pages

Monday, June 27, 2011

నా ప్రేమ-4 (కొనసాగింపు )

తపన ఎక్కువాయె
కునుకు దూరమాయె
నడక సాగాకపోయే
ముద్ద మింగుడుపడలే
ఎన్నాళ్ళకో ఇక నీ దర్శనం
ఏనాటికో మనకిక పరవశం
ఎన్నటికి నీవే నా సర్వస్వం
ఎప్పటికి మల్లి మనం కలుసుకుంటాం ?
చదవాలని కోరుకున్నదోక్కటి 
తల్లితండ్రుల కోరిక మరొకటి 
నా బవిష్యత్తు కారు చీకటి 
నేనెలా దీన్ని తొలగించేది
 
ఒప్పించాను ఒక చదువు  
నిర్ణయించాను కళాశాల 
చేరాలి తొందరలో
ఉండాలి నాచెలి నుంచి దూరంగా
 
వచ్చాను నా చెలి చోటికి
వేచాను తన వోరకంటి చూపుకి
దొరికింది నాకు తన చూపు
మదిలో కలిగే పెద్ద ఊపు
 
చేరాను కళాశాలలో
నా చెలికి ఇప్పుడు ఎంతో దూరం లో
ఇచ్చను తనకి ఆవేదన
ఇది తనకి నరకయాతన
 
చదువు లో శ్రద్ధ లేదు
ఆటల లో లీనం కాలేదు
బికారిలా తిరుగుతున్న
పిచ్చోడినై తపిస్తున్నా
 
ఎలా ఉన్నదో నా చెలి
కావలి తన కౌగిలి
తన ప్రేమే నా ఊపిరి
ఏమి జరుగుతుందో తదుపరి
 
వచ్చాను నా ఊరికి
వెతికాను తన ఆచూకి
తపించాను తన ప్రేమకి
ఎదురయ్యింది నా చెలి
పంచుకున్నం ప్రేమని కను పాపలో తో
చిరునవ్వు చిన్ధించాం పెదవులతో
పెంచుకున్నాం ప్రేమని మనసులో
ధచుకున్నాము కన్నీటిని కనురెప్పలలో……………….కొనసాగుతుంది

Wednesday, June 15, 2011

నా ప్రేమ 3 (కొనసాగింపు )

రోజు చూపులు కలిసే 
మదిలో ప్రేమ వెలసే 
చూడని క్షణము తపనే 
నీ కొరకై చేస్తున్న తపస్సే
 
నీ చిలిపి చిరునవ్వు 
నా మదికి పరిమళము
నాలో సెలయేరు పారే 
నీలో ప్రేమ పొంగే 
 
సెలవంటే మనకి కష్టం 
నీ వోరకంటి చూపే నా అద్రుష్టం 
నీ తలపే ఇష్టం
సెలవు రోజు నీ దర్శనం నాకు కష్టం
 
నను చూసిందే వచ్చే నీ లో చిరునవ్వు
చూడని రోజు నువ్వు వాడిన పువ్వు
నీకు అందమే నీ నవ్వు 
నాకు ఎప్పటికి అది ఇవ్వు 
 
రోజులు గడిచే
మనలో ప్రేమ పెరిగే
నీ ఒడి కావాలని నా మది అడిగే
నీలో సగామవ్వాలని కోరికే కలిగే
 
నీ కనుపపాలి ఎప్పుడు నన్నే వెతికే
నా హృదయం లో అనుక్షణం నీ తలపే
మనకి ఇది తొలివలపే
నా కనుబొమ్మలు నీకు ప్రేమను తెలిపే
 
అయ్యాను నేను నీకు చెలికాడు
నీవే జన్మ జన్మలకి నా తోడు
ఎవ్వరు మించలేరు మన ఈడు జోడు
కడుతానే నీ మేడలో పసుపుతాడు
 
నేను పట్టాను నాగలి
నాకు కావలి నీ కౌగిలి
వీస్తుంది మనమధ్య ప్రేమ గాలి
ఎవ్వరికి అర్ధం కాదు మన ప్రేమ లోగిలి
 
కను చూపులతో ప్రేమని పంచి
మనస్సులో ప్రేమని పెంచి
సిగ్గుతో తల వంచి
ఎకమవ్వాలి మన ప్రేమను గెలిపించి
 
విడిచి వెళ్ళే రోజు వచ్చింది
మదిలో అలజడే రేపింది
గుండెల్లో బారాం పెరిగింది
శవం లా నా దేహం కదిలింది
 
కళ్ళంతా కన్నీరు
అయ్యింది అది సెలయేరు
బాగావంతుడా మమ్మల్ని ఏకం చెయ్యి
నా చెలిని నాకు పూర్తిగా సొంతం చెయ్యి
 
క్షణాలు యుగాలయ్యే
నిన్ను కలిసే సమయానికి హృదయం వేచి చూసే
కలుస్తామా మనము
ప్రేమని పంచుకుంటామ ఆ క్షణము
 
పరీక్షా ఫలితాలు వచ్చే
నా పేరు కోసమై నీ కనులు వెతికే
తర్వాతే చూసావు నీ బంధువుల పేర్లే
నా రాక కోసం నీ గుండె వేచి ఉండే
 
వచ్చాను నేను
చూసాను నిన్ను
మాయమయ్యింది మన ఆవేదన
పగ వాడికి కూడా ఉండకూడదు ఈ వేదన
 
కలిసుండే సమయం కొంతే
మల్లి కలిసే తరుణం కొరతే
ఉన్నంత సమయం ప్రేమని పంచె
ఆనందం గా గడియలు గడిసే
 
మల్లి మనము కలిసేది ఏనాడు
చేనత వద్దు చెలియా  ఈనాడు
ఎప్పటికి నీవే నా గుండె చప్పుడు
ఎన్నటికి నేనే నీ తోడు
 
వేల్లోస్తనే సఖి  
వేదన వద్దే నా చెలి
కడుతాను నీకు తాళి 
నేను గెలిచి వచ్చి  ……….(కొనసాగుతుంది)
 

నా ప్రేమ 2 (కొనసాగింపు)

నీ జ్ఞాపకాలే నన్ను బ్రతికించే 
నిన్ను మరవలేదు ఏ క్షణం 
నిన్ను పొందడమే నా లక్ష్యం 
వేచివున్నాను నేను ప్రతిక్షణం
కాలం గడిచింది 
ప్రేమ పెరిగింది
తపన కొందంతయ్యింది
నీ తలపే స్వాశయ్యింది
శిలనయ్యను నేను
నా చోటిలో నువ్వు
ఇది కలా నిజామా చెప్పు
నా ఆవేదన తీర్చు 
నా ఫై నీ ప్రేమ తెలిసే
వచ్చింది నాకోసమని అర్ధమాయే
నీ తపన చూసి మనసు మురిసిపోయే
నా మది ఆకాశంలో ఎగిరే……….(కొనసాగుతుంది)